ఎర్రుపాలెం: బాలికలు ఆత్మవిశ్వాసంతో ఎదగాలి

0చూసినవారు
ఎర్రుపాలెం: బాలికలు ఆత్మవిశ్వాసంతో ఎదగాలి
బుధవారం ఎర్రుపాలెం మండలంలో జిల్లాకలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పర్యటించారు. స్థానిక సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, కళాశాలలో తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవం కార్యక్రమంలో పాల్గొని, సామాజిక న్యాయం, సమానత్వం, సమగ్ర అభివృద్ధికి పనిచేస్తామని విద్యార్థులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. మత విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందని, బాలికలు ఆత్మవిశ్వాసంతో ఎదగాలని కలెక్టర్ సూచించారు.

సంబంధిత పోస్ట్