ఎర్రుపాలెం: సోలార్ ప్లాంట్ పనుల పురోగతి పరిశీలన

2చూసినవారు
ఎర్రుపాలెం: సోలార్ ప్లాంట్ పనుల పురోగతి పరిశీలన
ఎర్రుపాలెం మండలం రాజుపాలెంలో ఇందిరా మహిళా శక్తి పథకం కింద ఏర్పాటు చేస్తున్న ఒక మెగావాట్ సోలార్ ప్లాంట్ పనులను బుధవారం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పరిశీలించారు. ఈ సందర్భంగా, ప్రభుత్వం మహిళలకు అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని ఆయన సూచించారు. సోలార్ ప్లాంట్ల ఏర్పాటు పునరుత్పాదక శక్తిని ప్రోత్సహించడమే కాకుండా మహిళా సాధికారతకు దోహదపడుతుందని తెలిపారు. ప్లాంట్ పనుల్లో వేగం పెంచాలని, నిర్వహణపై మహిళలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.