ఎర్రుపాలెం: వరంగల్ సభకు ఉత్సాహంగా కదలండి

56చూసినవారు
ఎర్రుపాలెం: వరంగల్ సభకు ఉత్సాహంగా కదలండి
వరంగల్లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పార్టీ కార్యకర్తలు కొత్త ఉత్సాహంతో బయలుదేరాలని రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు. సోమవారం ఎర్రుపాలెం మండలం బుచ్చిరెడ్డిపాలెంలో జరిగిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికార కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందని, బీఆర్ఎస్ ను దూరం చేసుకుని తప్పు చేశామని ప్రజలంతా పశ్చాత్తాప పడుతున్నారని పేర్కొన్నారు.