ఎర్రుపాలెం మండలంలోని వెంకటాపురం ఎస్సీకాలనీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా కోట ఏసు ఇంటికి అగ్నిప్రమాదం జరిగింది. రాత్రి ఇంటి బయట నిద్రించిన కుటుంబీకులు అప్రమత్తమయ్యేలోగా మంటలు చెలరేగి, ఇంట్లో దాచిన రూ. 1.15 లక్షల నగదు, రూ. 2 లక్షల విలువైన గృహోపకరణాలు, ఇతర సామగ్రి కాలి బూడిదయ్యాయి. జీపీఓ శ్రీనివాసరావు పంచనామా నిర్వహించారు.