
ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన టికెట్లపై భారీ తగ్గింపు!
దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, మే 31 వరకు విమాన టికెట్లపై 50% వరకు తగ్గింపు ఆఫర్ను ప్రకటించింది. ఈ ఆఫర్ కింద జూన్ 15 నుండి అక్టోబర్ 10 వరకు ప్రయాణించవచ్చు. సీటు సెలెక్షన్, ముందస్తు మీల్స్పై 20% డిస్కౌంట్ కూడా అందిస్తోంది. విద్యార్థులు, సీనియర్ సిటిజన్లు, భద్రతా దళాలకు కూడా ప్రత్యేక తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి.




