
హైదరాబాద్ కోఠిలో కాల్పుల కలకలం
TG: హైదరాబా్ కోఠి బ్యాంక్ స్ట్రీట్‌లో కాల్పుల ఘటన కలకలం రేపింది. ఎస్బీఐ ప్రధాన కార్యాలయం ఏటీఎం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. తుపాకీతో కాల్పులు జరిపిన దుండగులు రూ.6 లక్షలు ఎత్తుకెళ్లినట్లు సమాచారం. ఈ ఘటనలో రషీద్ అనే వ్యక్తికి గాయాలు కాగా.. అతడిని ఆస్పత్రికి తరలించారు. రంగంలోకి దిగిన సుల్తాన్‌బజార్ పోలీసులు ఘటనా స్థలంలో సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.




