
మెడికల్ వెడ్డింగ్ కార్డ్.. వైరల్
TG: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామానికి చెందిన కిన్నెర నవీన్, మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తున్నాడు. తన వివాహ ఆహ్వాన పత్రికను టాబ్లెట్ స్ట్రిప్ ఆకారంలో, వైద్య రంగానికి తగ్గట్టుగా రూపొందించి అందరినీ ఆకట్టుకున్నాడు. ఫిబ్రవరి 4న జరగనున్న ఈ వివాహానికి సంబంధించిన ఈ వినూత్న ఆహ్వానం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. వధూవరులిద్దరూ వైద్య రంగానికి చెందినవారే కావడం విశేషం.




