
తిరుమల ఆలయంలో నూతన జంట ఫోటోషూట్.. క్షమాపణలు కోరిన దంపతులు
తిరుమల శ్రీవారి ఆలయ ప్రాంగణంలో నిబంధనలకు విరుద్ధంగా నూతన జంట ఫోటోషూట్ చేయడంతో ఆ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. జనవరి 28న వివాహం చేసుకున్న తిరుమాల్, గాయత్రీ దంపతులు ఆలయం ముందు ఫోటోలకు ఫోజులిచ్చారు. నిబంధనలున్నప్పటికీ ఫోటోలు తీసినందుకు దంపతులు టీటీడీ అధికారులకు, భక్తులకు క్షమాపణలు తెలిపారు. ఆలయ సంప్రదాయాలను గౌరవించాల్సిన అవసరాన్ని తాము గ్రహించామని, ప్రాయశ్చిత్తంగా శ్రీవారి సేవల్లో పాల్గొంటామని తెలిపారు.




