మధిర: ముస్లిం కాలనీలో జిల్లా కలెక్టర్ పర్యటన

5చూసినవారు
శనివారం మధిర పట్టణంలోని ముస్లిం కాలనీని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సందర్శించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కాలనీ నీట మునిగింది. డిప్యూటీ సీఎం భట్టి ఆదేశాల మేరకు కలెక్టర్ అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను త్వరగా పరిష్కరించాలని మున్సిపల్ అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు కలెక్టర్‌తో కలిసి ప్రజా సమస్యలను తెలియజేశారు.

ట్యాగ్స్ :