మధిర మున్సిపాలిటీ పరిధిలోని మడుపల్లికి చెందిన బిఆర్ఎస్ నేత, మాజీ ఎంపీటీసీ రేగళ్ల సాంబశివరావు శుక్రవారం పార్టీకి రాజీనామా చేశారు. తన నిర్ణయాన్ని పార్టీ శ్రేణులకు తెలియజేసిన ఆయన, కార్యకర్తలతో విస్తృతంగా చర్చించిన అనంతరం భవిష్యత్తు రాజకీయ కార్యాచరణపై తుది నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. మున్సిపాలిటీ ఎన్నికల సమయంలో ఈ రాజీనామాతో మడుపల్లి ప్రాంత రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసింది.