మధిర మండలంలోని చిలుకూరును ఇందిరమ్మ ఇళ్లకు పైలట్ గ్రామంగా ఎంపిక చేయగా 37మంది లబ్ధిదారులు నిర్మాణాలను మొదలుపెట్టారు. ఈమేరకు పనులను మంగళవారం అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె లబ్ధిదారులతో మాట్లాడి ఇంటి నమూనా, ఇప్పటి వరకు అయిన వ్యయం తెలుసుకున్నారు. దశల వారీగా బిల్లులు మంజూరు కానున్నందున, నిధులను సద్వినియోగం చేసుకుంటూ ఇళ్ల నిర్మాణం పూర్తిచేయాలని సూచించారు.