మధిరలో విద్యుత్ సరఫరా కోసం అండర్ గ్రౌండ్ కేబుల్ వేయనుండగా ప్రతిపాదనలపై క్షేత్రస్థాయిలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డితో కలిసి పరిశీలించారు. ఆత్కూరు క్రాస్ నుంచి నందిగామ బైపాస్ రోడ్డు వరకు, ఆర్ఈ కాంప్లెక్స్ నుండి బస్టాండ్ వరకు భూగర్భంలో కేబుల్ వేసేలా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో భట్టి పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు.