మధిర: నామినేషన్ పరిశీలన ప్రక్రియ పూర్తి

3చూసినవారు
మధిర మున్సిపాలిటీలోని 22 వార్డులకు దాఖలైన 178 నామినేషన్లు సక్రమంగా ఉన్నాయని కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. అభ్యర్థులు ఫిబ్రవరి 3 మధ్యాహ్నం 3 గంటల వరకు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. మున్సిపాలిటీలో మొత్తం 17 ప్రాంతాల్లో 44 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 14 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. మున్సిపాలిటీలోని ఐదు డివిజన్లలో తొమ్మిది రూట్లుగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్