
కొంపముంచిన ఏఐ.. చిన్న పొరపాటుతో రూ.4800 కోట్ల నష్టం
AI వాడకంలో సరైన ప్రణాళిక, పర్యవేక్షణ లేకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆంథ్రోపిక్ సంస్థకు చెందిన క్లాడ్ ప్లాట్ఫామ్ ఘటన నిరూపించింది. ఉద్యోగులకు అపరిమిత యాక్సెస్ ఇవ్వడంతో, ఒకే నెలలో ఏకంగా 500 మిలియన్ డాలర్లు (సుమారు రూ.4,800 కోట్లు) బిల్లు చెల్లించింది. ఉద్యోగులు సృష్టించిన ఏఐ కోడింగ్ ఏజెంట్లు, పైప్లైన్లు నిరంతరాయంగా రన్ అవుతూ, లక్షలాది పేజీల టెక్స్ట్ను ప్రాసెస్ చేయడం వల్ల టోకెన్ల వినియోగం ఊహించని స్థాయిలో పెరిగి ఈ బిల్లు వచ్చిందని నివేదికలు తెలుపుతున్నాయి.




