మధిర ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న వెంకట్, మద్యం సేవించకపోయినా బ్రీత్ ఎనలైజర్ పరీక్షలో మద్యం సేవించినట్లు రిపోర్టు రావడంతో గత సంవత్సరం ఏప్రిల్ 25న విధుల నుంచి తొలగించబడ్డారు. దీనిపై హైకోర్టును ఆశ్రయించగా, బ్రీత్ ఎనలైజర్ ప్రాథమిక ఆధారమేనని, పూర్తి వైద్య పరీక్షలు చేయకుండా తొలగించడం సరికాదని న్యాయమూర్తి నామవరపు రాజేశ్వరరావు తీర్పు ఇచ్చారు. తొలగించిన డ్రైవర్‌ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఆర్టీసీ అధికారులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.