మధిర: స్కూల్ బస్సులో మంటలు... తప్పిన ప్రమాదం

3చూసినవారు
మధిర: స్కూల్ బస్సులో మంటలు... తప్పిన ప్రమాదం
మధిర మండలం ఆత్కూరు సమీపంలో బుధవారం ఓ ప్రైవేట్ స్కూల్ బస్సులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. అదృష్టవశాత్తు, డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బస్సును ఆపి విద్యార్థులందరినీ సురక్షితంగా కిందకు దించారు. అనంతరం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించి మంటలను ఆర్పివేశారు. ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్