గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ ఈ నెల 3వ తేదీన మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగుతుందని తహసీల్దార్ రాళ్లబండి రాంబాబు, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు తెలిపారు. అభ్యర్థులు ఎంపీడీఓ, ఆర్ఓ కార్యాలయాల్లో లేదా నామినేషన్ వేసిన పంచాయతీ క్లస్టర్ కార్యాలయాల్లో ఫారం-7 ను తీసుకొని, పూరించి సంబంధిత ఆర్ఓకి స్వయంగా అందించి రశీదు పొందాలని సూచించారు. ఉపసంహరణ ప్రక్రియ పూర్తయ్యాక అభ్యర్థులకు గుర్తులు కేటాయించబడతాయి.