మధిర మండలం ఖమ్మంపాడులో నాలుగు రోజుల క్రితం జరిగిన గ్యాస్ సిలిండర్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మువ్వ ఆనందలక్ష్మి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతి చెందారు. ఆమె మృతితో ఖమ్మంపాడు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని ధృవీకరించారు.