ముదిగొండ: భూభారతి చట్టంతో రైతులకు మేలు

62చూసినవారు
ముదిగొండ: భూభారతి చట్టంతో రైతులకు మేలు
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి చట్టంతో రైతులకు మేలు జరుగుతుందని ముదిగొండ తహశీల్దార్ సునీత ఎల్జిబెత్ అన్నారు. మంగళవారం ముదిగొండ మండలం మాదాపురం, కమలాపురం గ్రామపంచాయితీలలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులను తహసీల్దార్ సందర్శించారు. రెవెన్యూ సిబ్బందితో కలిసి ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. భూసమస్యల పరిష్కారానికే ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తుందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్