ముదిగొండ: పెద్దమండవ నుంచి అక్రమ ఇసుక రవాణా

0చూసినవారు
ముదిగొండ: పెద్దమండవ నుంచి అక్రమ ఇసుక రవాణా
ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం పెద్దమండవలో మున్నేరు వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలింపు జరుగుతోందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. గ్రామానికి చెందిన ఒక వ్యక్తి, ఒక ప్రభుత్వ అధికారిణి ఆధ్వర్యంలోనే ఈ అక్రమ రవాణా జరుగుతోందని వారు తెలిపారు. ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాల్సిన ప్రజాప్రతినిధులు, అధికారులు తమ బాధ్యతలను విస్మరించి, అక్రమ రవాణాకు సహకరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నతాధికారులు ఈ వ్యవహారంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :