చైనా మాంజాపై నిషేధం నేపథ్యంలో, ముదిగొండ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లోని కిరాణా, ఫాన్సీ షాపుల్లో సీఐ ఓ. మురళి ఆదేశాలతో ఎస్ఐ అశోక్ ఆధ్వర్యాన తనిఖీలు చేపట్టారు. చైనా మాంజాను ఎవరూ అమ్మరాదని, అమ్మినా, కొనుగోలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు అవగాహన కల్పించారు. పతంగులు ఎగురవేసేందుకు చైనా మాంజా వాడటం వల్ల వన్యప్రాణులతో పాటు ప్రజలకు కూడా ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు.