ముదిగొండ మండలం ముత్తారం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ భూములను ఈనెల 10న ఉదయం 11 గంటలకు బహిరంగ వేలం వేయనున్నట్లు అధికారులు తెలిపారు. 2026-27 సంవత్సరానికి గాను ఆలయ ప్రాంగణంలోనే ఈ ప్రక్రియ జరుగుతుంది. వేలంలో పాల్గొనే రైతులు రూ. 20,000 డిపాజిట్ చేయాలి. వేలం ఖరారైన వెంటనే పూర్తి నగదు చెల్లించాలని స్పష్టం చేశారు. ఆసక్తి గల వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.