భూభారతి చట్టం ద్వారా భూ సమస్యల పరిష్కారం వేగవంతం అవుతుందని మండల తహశీల్దార్ సునీత ఎల్జిబెత్ అన్నారు. గురువారం ముదిగొండ మండలం మల్లారం గ్రామపంచాయతీలో నిర్వహించిన రెవెన్యూ సదస్సును తహశీల్దార్ సందర్శించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి భూ సమస్యలకు సంబంధించి దరఖాస్తులను స్వీకరించారు. అనంతరం ప్రజలకు భూభారతి చట్టంపై అవగాహన కల్పించారు. భూ భారతితో రెవెన్యూ సేవలు ప్రజలకు మరింత చేరువకానున్నాయని చెప్పారు.