ముదిగొండ: విద్యార్థుల క్షేత్ర సందర్శన

2చూసినవారు
ముదిగొండ: విద్యార్థుల క్షేత్ర సందర్శన
మంగళవారం, పమ్మి ప్రాథమిక పాఠశాల విద్యార్థులు క్షేత్ర సందర్శనలో భాగంగా ముదిగొండలోని పోలీస్ స్టేషన్, తహసీల్దార్ కార్యాలయం, మండల పరిషత్ కార్యాలయం, ఎస్బీఐ, మండల విద్యావనరుల కేంద్రాన్ని సందర్శించారు. ఆయా కార్యాలయాల్లో అందించే సేవలను విద్యార్థులు తెలుసుకున్నారు. పోలీస్ సిఐ మురళి విద్యార్థులకు స్టేషన్ పనితీరు, ఫిర్యాదులు చేసే విధానం, చట్టాలపై అవగాహన కల్పించారు. పుస్తక జ్ఞానంతో పాటు సామాజిక అంశాలపై అవగాహన కలిగి ఉండాలని ఆయన సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్