ఎన్టీఆర్ జిల్లాలో పేద కళాకారులకు సన్మానం

2చూసినవారు
ఎన్టీఆర్ జిల్లా, గంపలగూడెం మండలం పెనుగొలనులో సోమవారం శిరిడి సాయిబాబా సేవాకమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన పేద కళాకారులను ఘనంగా సన్మానించారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పెద్ద కోరుకొండ గ్రామానికి చెందిన సన్నాయి మేళం కళాకారులు మాదాల నాగరాజు, ఆవుల చినవీరస్వామి, ఆవుల పెద్దవీరస్వామిలకు సాయిబాబా కమిటీ సభ్యులు నూతన వస్త్రాలతో సత్కరించారు. మంగళ వాయిద్యాల్లో సన్నాయి మేళంకు ప్రముఖ స్థానం ఉందని, ఆ కళను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పలువురు తెలిపారు. ఈ కార్యక్రమంలో సాయిబాబా కమిటీ అధ్యక్షులు వూటుకూరు నారాయణరావు, తోలేటి జయసింహ, టీచర్ కే. లింగమ్మ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్