బాలమురళీకృష్ణ జ్ఞాపకార్థం వృద్ధులకు శైలజారాణి సేవా కార్యక్రమం

0చూసినవారు
బాలమురళీకృష్ణ జ్ఞాపకార్థం వృద్ధులకు శైలజారాణి సేవా కార్యక్రమం
ఖమ్మం జిల్లా, మధిరలో కీర్తిశేషులు కందిబండ బాలమురళీకృష్ణ జ్ఞాపకార్థం ఆయన సతీమణి శైలజారాణి ఆదరణ సేవా ఫౌండేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా మంగళవారం వృద్ధ మహిళలకు చీరలు, వృద్ధులకు పంచలు, అరటిపండ్లు, పులిహోరతో పాటు 25 కిలోల బియ్యం అందజేశారు. కుమారులు రాజేష్, రాకేష్ సహకారంతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు శైలజారాణి తెలిపారు. ఈ కార్యక్రమంలో లతీఫ్, హరికృష్ణ, అక్కిణమ్మ, ఫౌండేషన్ నిర్వాహకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్