ఖమ్మం: నృత్య కళానికేతన్ నందు ఘనంగా రథసప్తమి ప్రత్యేక పూజ

75చూసినవారు
ఖమ్మం: నృత్య కళానికేతన్ నందు ఘనంగా రథసప్తమి ప్రత్యేక పూజ
ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని కళా సాధన నృత్య కళానికేతన్ నందు మంగళవారం రథసప్తమి సందర్భంగా కప్పగంతుల రవిశాస్త్రి ఆద్వర్యంలో కూచిపూడి నేర్చుకుంటున్న చిన్నారులను ఆశీర్వదిస్తూ నటరాజ కృపా కటాక్షం కోసం ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళా సాధన నృత్య కళానికేతన్ ఆర్గనైజర్, కొరియోగ్రాఫర్ కళ్యాణపు నాగరాజు, కూచిపూడి గురువులు మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్