బోనకల్ నూతన తహసీల్దార్‌గా సుధాకర్ బాధ్యతలు స్వీకరణ

3చూసినవారు
బోనకల్ నూతన తహసీల్దార్‌గా సుధాకర్ బాధ్యతలు స్వీకరణ
ఖమ్మం జిల్లా, మధిరలోని బోనకల్ మండల నూతన తహసీల్దార్ (ఎమ్మార్వో)గా సీహెచ్ సుధాకర్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు ఎమ్మార్వోగా పనిచేసిన రమాదేవి నల్గొండ జిల్లా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా బదిలీ కావడంతో ఆమె స్థానంలో సుధాకర్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు ఆయనను కలిసి అభినందనలు తెలిపారు. మండల ప్రజలకు పారదర్శకంగా, వేగవంతమైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని సుధాకర్ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్