ఖమ్మం జిల్లా మధిర మండల పరిధిలోని అల్లి నగరం గ్రామంలో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు మంగళవారం గ్రామంలో బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం ద్వారా విద్యార్థులకు అందే పాఠ్యపుస్తకాలు, దుస్తులు, మధ్యాహ్న భోజనం, నాణ్యమైన విద్య గురించి వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు.