
తిరుమలలో భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 12 గంటల సమయం
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూకాంప్లెక్స్2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరి పార్కులోని 7 షెడ్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. బుధవారం శ్రీవారిని 87,691 మంది భక్తులు దర్శించుకున్నారు, 49,958 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.99 కోట్లుగా నమోదైంది.




