మధిర రైల్వే ట్రాక్ కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న రవాణా కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపుతామని బీజేపీ రాష్ట్ర మాజీ కిసాన్ మోర్చా అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి బుధవారం హామీ ఇచ్చారు. రైల్వే అండర్ పాస్ నిర్మాణానికి ప్రభుత్వం డీపీఆర్ సిద్ధం చేసిన 48 గంటల్లోనే కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతులు తీసుకువచ్చే బాధ్యతను తాము తీసుకుంటామని ఆయన ప్రకటించారు.