మిర్చి పంట అధికంగా పండించే ఖమ్మం జిల్లాలో ప్రత్యేక మిర్చి బోర్డు ఏర్పాటు కోసం కృషి చేస్తానని బీజేపీ రాష్ట్ర నాయకులు తాండ్ర వినోద్ రావు తెలిపారు. మంగళవారం మధిరలోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. మధిరలో రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణానికి పాటుపడతామని కొండపల్లి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు.