చింతకాని మండల కేంద్రంలోని రైతువేదికలో బుధవారం తహసీల్దార్ బాబ్జ ప్రసాద్ 64 మంది లబ్ధిదారులకు రూ. 64.07 లక్షల విలువైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మత్కేపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేశ్వరరావు, ఎంపీడీఓ శ్రీనివాసరావు, గ్రామ సర్పంచులు, ఉపసర్పంచులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు. ఈ పథకం ద్వారా అర్హులైన వారికి ఆర్థిక సహాయం అందించడం జరుగుతోంది.