తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మధిర నియోజకవర్గం, చింతకాని మండలం, జగన్నాధపురం గ్రామంలో నిర్వహిస్తున్న రైతు ఆశీర్వాద సభకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతున్న నేపథ్యంలో, రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదివారం సభాస్థలి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో శాసన సభ్యులు కోరం కనకయ్య కూడా పాల్గొన్నారు.