చింతకాని: రైతు ఆశీర్వాద సభ.. వర్షంతో బ్రేక్ పడేనా?

2135చూసినవారు
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలం మత్కేపల్లి క్రాస్ రోడ్డు వద్ద రైతు ఆశీర్వాద బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సభలో సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. అయితే, రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సభా ప్రాంగణం బురదమయంగా మారింది. నిరంతరాయంగా వర్షం కురిస్తే, సభ నిర్వహణ కష్టతరం కావడంతో వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది.

సంబంధిత పోస్ట్