SSC ఫలితాల్లో న్యూ విజన్ స్కూల్ విజయదుందుభి

1220చూసినవారు
SSC ఫలితాల్లో న్యూ విజన్ స్కూల్ విజయదుందుభి
బుధవారం ప్రకటించిన పదవ తరగతి వార్షిక పబ్లిక్ పరీక్ష ఫలితాలలో నగరంలోని న్యూ విజన్ పాఠశాల విద్యార్థిని పసుపులేటి హంసిని 592 మార్కులు సాధించి ప్రతిభ కనబరిచిందని న్యూ విజన్ విద్యాసంస్థల చైర్మన్ సి.హెచ్. జీకే ప్రసాద్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తమ పాఠశాల నుండి పదవ తరగతి పరీక్షలకు హాజరైన విద్యార్థుల్లో 90 శాతం పైగా మార్కులు సాధించిన వారు 290 మంది ఉన్నారని, ఇది ఇప్పటివరకు ఏ పాఠశాల సాధించని ఘనత అని పేర్కొన్నారు.
అలాగే 550 పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 230 మంది, 500 పైగా మార్కులు సాధించిన వారు 460 మంది ఉన్నారని తెలిపారు. మిగిలిన విద్యార్థులంతా 430 పైగా మార్కులు సాధించడం విశేషమన్నారు.

ఈ ఏడాది ఫలితాల్లో అన్ని సబ్జెక్టులలో నూటికి నూరు మార్కులు తమ పాఠశాల విద్యార్థులు సాధించడం ఆనందదాయకమని తెలిపారు. తెలుగులో 10 మంది, హిందీలో 6 మంది, ఇంగ్లీషులో 4 మంది, గణితంలో 61 మంది, సైన్స్‌లో 4 మంది, సోషల్‌లో 10 మంది  సాధించారని పేర్కొన్నారు.తమ పాఠశాల నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించిందని తెలిపారు. ఇంతటి ఘనవిజయం సాధించిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. విజయానికి కృషి చేసిన అధ్యాపక బృందాన్ని, సహకరించిన తల్లిదండ్రులను అభినందిస్తూ ధన్యవాదాలు తెలిపారు.
 
ఈ కార్యక్రమంలో న్యూ విజన్ విద్యాసంస్థల చైర్మన్ సి.హెచ్. జీకే ప్రసాద్, అకడమిక్ డైరెక్టర్ సి.హెచ్. కార్తీక్, డైరెక్టర్ సి.హెచ్. గోపిచంద్, పాఠశాల ప్రిన్సిపాల్ ఎం.డి. అబాద్ అలీ, జె.వి. మైకేల్ మరియు ఉపాధ్యాయ బృందం విద్యార్థులను అభినందించారు.
ఇట్లు,
ప్రిన్సిపాల్
ఎం.డి. అబాద్ అలీ
న్యూ విజన్ స్కూల్, ఖమ్మం.

సంబంధిత పోస్ట్