రాష్ట్ర స్థాయి సైన్స్ డ్రామా పోటీల్లో న్యూ విజన్‌ విద్యార్థులు ప్రతిభ

3చూసినవారు
రాష్ట్ర స్థాయి సైన్స్ డ్రామా పోటీల్లో న్యూ విజన్‌ విద్యార్థులు ప్రతిభ
విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, సృజనాత్మకతను పెంపొందించడమే లక్ష్యంగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి సైన్స్ డ్రామా పోటీల్లో ఖమ్మం జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించిన న్యూ విజన్ కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన ది లాస్ట్ క్రై ఆఫ్ ది ఓషన్ డ్రామా రాష్ట్ర స్థాయిలో తృతీయ బహుమతి సాధించినట్లు ప్రిన్సిపాల్ ఎండి అబాద్ అలీ తెలిపారు. సెప్టెంబర్ 22న హైదరాబాద్‌లోని ఎస్‌సీఈఆర్‌టీ భవన్ లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో న్యూ విజన్ విద్యార్థులు ప్రదర్శించిన “ది లాస్ట్ క్రై ఆఫ్ ది ఓషన్” సైన్స్ డ్రామా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. సముద్ర కాలుష్యం, ప్లాస్టిక్ వ్యర్థాలు, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలను ఇతివృత్తంగా తీసుకుని విద్యార్థులు చక్కటి సందేశాన్ని అందించారు. జిల్లాస్థాయిలో 38 పాఠశాలల మధ్య జరిగిన పోటీల్లో న్యూ విజన్ విద్యార్థులు ప్రథమ స్థానాన్ని సాధించి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. డ్రామాలో ఆర్. అక్షయ శ్రీ (10వ తరగతి), తన్వీర్, ఎం.డి. హిఫ్జా, ఝాన్సీ, సి.హెచ్. విదీప్ (8వ తరగతి), క్షేత్ర, సి.హెచ్. తన్వి (7వ తరగతి), అమ్హర్ (6వ తరగతి) నటులుగా పాల్గొన్నారు. సైన్స్ ఉపాధ్యాయులు జి. ఉష, డి. సబిత, భవాని, జనార్ధన్, స్రవంతి, సునీత గైడ్ టీచర్లుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ సి.హెచ్. కార్తీక్ మాట్లాడుతూ, జిల్లాస్థాయిలో 38 పాఠశాలల మధ్య ప్రథమ స్థానాన్ని సాధించి, రాష్ట్ర స్థాయిలోనూ తృతీయ బహుమతి పొందడం పాఠశాలకు గర్వకారణమన్నారు. విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ సి.హెచ్.జీకే ప్రసాద్, డైరెక్టర్ సి.హెచ్. కార్తీక్, ప్రిన్సిపాల్ ఎం.డి. అబాద్ అలీ, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్