పాలేరు - Paleru

బాలల దినోత్సవం: నెహ్రూకు నివాళి, పౌష్టికాహారంపై అవగాహన

బాలల దినోత్సవం: నెహ్రూకు నివాళి, పౌష్టికాహారంపై అవగాహన

ఖమ్మం రూరల్ మండలం, ఎదులాపురం మున్సిపల్ పరిధిలోని రాజీవ్ గృహ కల్ప కాలనీ అంగన్ వాడి కేంద్రంలో శుక్రవారం బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని ఈ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. చిన్న పిల్లలకు నెహ్రూ వస్త్రధారణ చేయించి వేడుకలు నిర్వహించారు. అనంతరం తల్లులకు పౌష్టికాహారం ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో అంగన్ వాడి టీచర్ అక్తర్ బేగం, మరియు తల్లులు పాల్గొన్నారు.

వీడియోలు


ఖమ్మం జిల్లా