రాష్ట్రంలో సమృద్ధిగా యూరియా నిల్వలు: మంత్రి తుమ్మల

4చూసినవారు
రాష్ట్రంలో సమృద్ధిగా యూరియా నిల్వలు: మంత్రి తుమ్మల
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో యూరియా నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, అయినప్పటికీ అనవసర ఆందోళనలు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ప్రస్తుతం సుమారు 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని, సొసైటీ/రిటైల్ షాపులకు వచ్చే ప్రతి రైతుకు అవసరమైన మేరకు బస్తాలు అందుతున్నాయని ఆయన పేర్కొన్నారు. యూరియా యాప్ అమలులో ఉన్న జిల్లాల్లో ఎలాంటి ఇబ్బందులు లేవని, ఈ యాప్ ద్వారా దాదాపు లక్ష మంది రైతులు 3.19 లక్షల బస్తాలు కొనుగోలు చేశారని మంత్రి వెల్లడించారు.

సంబంధిత పోస్ట్