ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్‌ను బుధవారం అదనపు డీసీపీ లా అండ్ ఆర్డర్ ప్రసాద్ రావు సందర్శించి, స్టేషన్ నిర్వహణ, సిబ్బంది పనితీరు, దర్యాప్తు నివేదికలు, సీసీటీఎన్ఎస్ అప్‌లోడ్‌లు, జనరల్ డైరీ రికార్డులు, స్వాధీనం చేసుకున్న వాహనాలు, పరిసరాలను తనిఖీ చేశారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రౌడీషీటర్లు, నేర చరిత్ర ఉన్నవారిపై దృష్టి సారించాలని, గ్రామాల్లో క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులను ఆదేశించారు.