నేలకొండపల్లి మండల కేంద్రంలో సోమవారం ఉదయం ఖమ్మం – కోదాడ ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఎలగం కేతమ్మ (56) అకస్మాత్తుగా అస్వస్థతకు గురై స్పృహ తప్పి పడిపోయింది. తోటి ప్రయాణికుల సమాచారంతో డ్రైవర్ సమయస్ఫూర్తిగా స్పందించి బస్సును నేరుగా నేలకొండపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.