బోదులబండలో కోకో పోటీలు: విద్యార్థులకు ప్రోత్సాహం

2చూసినవారు
నేలకొండపల్లి మండలం బోదులబండ గ్రామపంచాయతీ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం కోకో పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా, నెలకొండపల్లి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ వెన్నుపూసల సీతారాములు మాట్లాడుతూ, విద్యార్థులకు ఉన్నత చదువులతో పాటు క్రీడలు కూడా ముఖ్యమని తెలిపారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ద్వారా పాలేరు నియోజకవర్గం ప్రజలు ప్రభుత్వ పథకాలను అందిపుచ్చుకుంటున్నారని, విద్యార్థులకు సైకిళ్లు, పుస్తకాలు, కంప్యూటర్లు వంటి ఉపయోగపడే వస్తువులు పంపిణీ చేస్తారని ఆయన సభాముఖంగా తెలియజేశారు.