కూసుమంచి: మొక్కజొన్న పంట అవశేషాలు కాల్చొద్దు

2చూసినవారు
కూసుమంచి: మొక్కజొన్న పంట అవశేషాలు కాల్చొద్దు
మొక్కజొన్న పంట అవశేషాలను కాల్చడం వల్ల భూమికి తీరని నష్టం వాటిల్లుతుందని, పొలంలో కలియ దున్నడం వల్ల భూసారం పెరుగుతుందని ఏవో రామడుగు వాణి తెలిపారు. గురువారం కూసుమంచి మండలం జీళ్లచెరువులో మొక్కజొన్న పంట అవశేషాలను తగలబెడుతున్న క్షేత్రాలను సందర్శించిన ఆమె రైతులకు వాటి వల్ల కలిగే అనర్థాలను వివరించారు. మొక్కజొన్న కొయ్యలు, గడ్డికి నిప్పు పెట్టడం వల్ల సూక్ష్మ జీవులు, మిత్ర పురుగులు చనిపోతాయని ఆమె చెప్పారు. ఈ చర్యలు పర్యావరణానికి హానికరమని, భూసారాన్ని తగ్గించి, పంట దిగుబడిపై ప్రతికూల ప్రభావం చూపుతాయని ఆమె రైతులకు సూచించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you