ఎదులాపురం: కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే మరింత అభివృద్ధి

6చూసినవారు
ఎదులాపురం: కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే మరింత అభివృద్ధి
ఖమ్మం రూరల్ మండలం టీసీవి రెడ్డి పంక్షన్ హాల్లో ఎదులాపురం మున్సిపాలిటీ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈనెల 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే ఎదులాపురం మరింత అభివృద్ధి చెందుతుందని మంత్రి కొండా సురేఖ అన్నారు. గతంలో ఎన్నికలు లేకపోవడంతో ఈ ప్రాంతం వెనుకబడిందని, ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రి పొంగులేటి కృషితో ఏదులాపురం మున్సిపాలిటీగా మారిందని ఆమె తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్