ఏదులాపురం: బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించండి

0చూసినవారు
ఏదులాపురం: బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించండి
ఏదులాపురం మున్సిపాలిటీలో సీపీఎం, బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం గురువారం ప్రచారం జరిగింది. మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ, మున్సిపాలిటీలో అభివృద్ధి, సంక్షేమం కొనసాగాలంటే కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 24వ వార్డులో సీపీఎం అభ్యర్థి ధారవత్ శ్రీకాంత్, 23వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి అడ్డాకుల శారద, 1వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి దుంపల నాగరాజు గెలుపును ఆకాంక్షిస్తూ ఈ ప్రచారం నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్