మున్నేరులో వరద ప్రవాహం కొనసాగుతున్నా, ముంపు ప్రాంతాలకు మంత్రులు పొంగులేటి, తుమ్మల కన్నెత్తి చూడకపోవడంపై స్థానికులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పాలేరు, ఖమ్మం నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు తమ ప్రాంతాల్లోని పలు కాలనీలు నీట మునిగినా పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కీలక శాఖలు నిర్వహిస్తున్న మంత్రులు తమను పట్టించుకోకపోవడంపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారు.