తాను ఎల్లప్పుడూ ప్రజల మధ్యనే ఉంటూ, వారి శ్రేయస్సు కోసమే నిరంతరం శ్రమిస్తానని మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి ఆదివారం స్పష్టం చేశారు. బోదులబండ ముత్యాలమ్మ తల్లి కటాక్షంతో ఊరిలోని రైతులు, కూలీలు, అన్ని వర్గాల ప్రజలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. తనకు ఏ పార్టీ వ్యత్యాసాలు, ఎవరిపైనా ద్వేషం లేవని. తాను నిరంతరం ప్రజల కోసమే పనిచేస్తూ ముందుకు సాగుతానని ఆయన తెలిపారు.