ఖమ్మం: జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని వినతి

78చూసినవారు
ఖమ్మం: జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని వినతి
జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని సోమవారం ఖమ్మంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని టీయూడబ్ల్యూజే టీజేఎఫ్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందించారు. జిల్లాలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ఇళ్ల స్థలాలు, అక్రిడేషన్ కార్డులు, హెల్త్ కార్డుల అంశాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అక్రిడేషన్ కార్డులతో పాటు ఇళ్ల స్థలాల జారీకి చర్యలు తీసుకుంటామని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్