ఖమ్మం రూరల్: ఆర్టీసీ బస్సు ఢీకొని ఆటోడ్రైవర్ మృతి

5చూసినవారు
ఖమ్మం రూరల్: ఆర్టీసీ బస్సు ఢీకొని ఆటోడ్రైవర్ మృతి
మంగళవారం రాత్రి ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి గొల్లగూడెం వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొని ఆటో డ్రైవర్ కుక్కల మధు (36) మృతి చెందారు. ఖమ్మం వైపు వెళ్తున్న మధును ఎదురుగా వచ్చిన బస్సు ఢీకొనడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మరణించారు. మధుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు సమాచారం మేరకు అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు తన బృందంతో మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్