ఖమ్మం రూరల్: మున్సిపాలిటీలో ఇంటి పన్నుల మదింపు

67చూసినవారు
ఖమ్మం రూరల్: మున్సిపాలిటీలో ఇంటి పన్నుల మదింపు
ఏదులాపురం మున్సిపాలిటీలో పన్నులను మదించి గెజిట్ విడుదల చేశామని కమిషనర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి శుక్రవారం తెలిపారు. గతంలో గ్రామపంచాయతీగా ఉన్నప్పుడు మూలధనంపై నివాస గృహాలకు 0. 12శాతం, వ్యాపార సముదాయం, ఇళ్లు కలిసి ఉన్న భవనాలకు 0. 16శాతం పన్ను ఉండేదని, ఇప్పుడు నివాస గృహాలకు 0. 12శాతం పన్నునే కొనసాగిస్తూ, వ్యాపార సముదాయం, ఇళ్లు కలిసి ఉన్న భవనాలకు 0. 25శాతం, ఖాళీ ప్లాట్లకు 0. 05శాతం పన్ను వసూలు చేయనున్నట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్